News

కాశ్మీర్ ఝార్ఖండ్ లలో పోలింగ్‌





  హైదరాబాద్‌: జమ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆదివారం నాలుగో దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌లోని 18 నియోజకవర్గాల్లో ఉదయం 10 గంటల సమయానికి 10.27 శాతం పోలింగ్‌ నమోదైంది. విపరీతమైన చలిలోనూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సొనావర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒమర్‌ ఈ ఎన్నికల్లో సొనావర్‌, బీర్వా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఝార్ఖండ్‌లోని 15 నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటలకు 13శాతం పోలింగ్‌ నమోదైంది. ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్‌ మరాండీ పోటీచేస్తున్న గిరిధ్‌ నియోజకవర్గంలో ఈ దశలోనే పోలింగ్‌ కొనసాగుతోంది. నాలుగో దశ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.